Viral Video | చెట్టుపై నుంచి రూ.2 లక్షల నోట్లు కురిపించిన కోతి.. అసలు ఎలా జరిగిందంటే
Viral Video : ఉత్తర ప్రదేశ్‌లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఒక కోతి చెట్టుపై నుంచి రెండు లక్షల రూపాయల నోట్లు కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video : ఉత్తర ప్రదేశ్‌లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఒక కోతి చెట్టుపై నుంచి రెండు లక్షల రూపాయల నోట్లు కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. ఉత్తర్ ప్రదేశ్, బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన ఒక లాయర్ కచేరి రోడ్లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ లాయర్ ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కోసం రూ.2లక్షల నగదు ఉన్న బ్యాగును చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఉన్నట్లుండి ఒక కోతి వెనుక నుంచి వచ్చి ఆ బ్యాగును ఎత్తుకుని పోయింది. దగ్గర్లో ఉన్న ఒక చెట్టు పైకి ఎక్కింది. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి, అందులో ఉన్న కరెన్సీ నోట్లను చెట్టు పైనుంచి కిందికి విసిరేయడం స్టార్ట్ చేసింది. అలా రూ.500 నోట్లను వరుసగా కిందికి విసిరేస్తూనే ఉంది. కిందే ఉన్న లాయర్, అతడి అసిస్టెంట్ ఏమీ చేయలేక చూస్తుండిపోయారు. ఇదే క్రమంలో చెట్టుపైనుంచి రూ.500 కరెన్సీ నోట్లు కింద పడటం చూసిన స్థానికులు కొందరు అక్కడికి వచ్చి ఆ నోట్లను ఏరుకున్నారు. ఇంకొందరు ఆ నోట్లను తీసి, లాయర్‌కు అప్పగించారు. కొంతసేపటి తర్వాత ఒక వ్యక్తి ఆ చెట్టు పైకి ఎక్కి, కోతిని భయపెట్టేందుకు ప్రయత్నించాడు.
बुलंदशहर में पेड़ से नोटों की बारिश, बंदर ने उड़ा दिया वकील का बैग#trending #viralvideo pic.twitter.com/Zc7rdsiyQC
— Nurnain Ali (@nurnainali) May 31, 2026
అలా కొంతసేపు ప్రయత్నించిన తర్వాత ఆ కోతి నోట్లున్న బ్యాగును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం ఆ బ్యాగును ఎలాగోలా లాయర్ తీసుకున్నాడు. కానీ, ఈలోపే ఆ రూ.2 లక్షల నోట్లలో చాలా వరకు కోతి కింద పడేసింది. కొందరు ఆ నోట్లను తీసుకుని వెళ్లిపోయారు. ఇంకొందరు తిరిగిచ్చారు. అందరిదగ్గరి నుంచి నోట్లు కలెక్ట్ చేసి, కింద పడ్డ నోట్లను ఏరిన తర్వాత చూస్తే కొంత నగదు తగ్గింది. ఈ విషయంపై అతడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. మరికొందరు తమ సెల్ఫోన్లలో రికార్డ్ చేశారు. మరోవైపు ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువైందని స్థానికులు విమర్శిస్తున్నారు. కోతుల బెడదనుంచి రక్షించాలని కోరుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

