e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News కశ్మీరీలు పాక్‌లో చేరడంపై రెఫరెండం : పీఓకే ఎన్నికల్లో ఇమ్రాన్‌ హామీ

కశ్మీరీలు పాక్‌లో చేరడంపై రెఫరెండం : పీఓకే ఎన్నికల్లో ఇమ్రాన్‌ హామీ

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) లో ఎన్నికలు సమీపంలో ఉండటంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డారు. పీఓకేలో తన పార్టీకి ప్రజా మద్దతు చాలా బలహీనంగా ఉంటున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు నిత్యం ఏదో ఒక వాగ్దానం చేస్తున్నారు. కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్‌లో చేరాలనుకుంటున్నారా? స్వతంత్ర దేశంగా ఉండాలనుకుంటున్నారా? అని తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ఇమ్రాన్‌ఖాన్ శుక్రవారం రాత్రి తెలిపారు.

ఈ నెల 25 న పీఓకే అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పీఓకేలో సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో పీఓకేకు చెందిన దాదాపు 20 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 53 స్థానాల నుంచి దాదాపు 700 మంది బరిలో ఉన్నారు. 2019 లో ఇక్కడి 53 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 1970 లో తొలిసారిగా పీఓకేలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. కాగా, పెరుగుతున్న కరోనా ముప్పు కారణంగా.. ఎన్నికలను రెండు నెలల పాటు వాయిదా వేయాలని స్థానిక పౌరహక్కుల సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. పంజాబ్‌, సింధ్‌, బలూచిస్తాన్‌, ఖైబర్‌ ఫంక్తూంక్వా అనే నాలుగు ప్రావిన్స్‌లు పీఓకేలో ఉన్నాయి. గత ఏడాది పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

- Advertisement -

విద్యుత్‌, గ్యాస్ సరఫరా, మంచి రోడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను ఈ ప్రాంత ప్రజలు కోరుతుండటంతో.. వారిని మభ్యపెట్టేందుకు ఇమ్రాన్ ఖాన్‌ ప్లెబిసైట్‌ను తెరపైకి తీసుకొచ్చినట్లుగా నిపుణులు అంటున్నారు. సామాన్య ప్రజల దుస్థితిపై చర్చకు బదులుగా కశ్మీర్ సమస్యపై భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి పాకిస్తాన్ ప్రధాని ఎంచుకున్నారు.
ఇమ్రాన్‌ఖాన్‌పై పైచేయి సాధించేందుకు పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) పార్టీ అధినేత నవాజ్‌ షరీప్‌ కుమార్తె మరియం ఒకవైపు, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) చైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ ఇంకోవైపు నుంచి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్శిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

1991 నాటి ఆర్థిక కష్టాలు రానున్నాయి : మన్మోహన్‌ సింగ్‌ హెచ్చరిక

సెప్టెంబర్‌ నుంచి చిన్నారులకు కరోనా టీకాలు : గులేరియా

ఐఏఎస్‌ అధికారి నివాసంలో సీబీఐ తనిఖీలు

రాజ్‌ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా

చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్‌ ఇది

పైకి పెరిగిన భూమి.. హర్యానాలో వింత సంఘటన!.. వీడియో వైరల్‌..

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana