Arvind Kejriwal | ఉచిత విద్యుత్, ఉచిత రేషన్, నిరుద్యోగ భృతితో కూడిన ఆప్ మేనిఫెస్టోతోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ (Congress) పార్టీ విజయం సాధించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi Cm), ఆప్ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) అన్నారు. ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ నాయకులను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు.
దేశ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చడంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించిందన్నారు. ‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మేనిఫెస్టోని అనుసరించడంతోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ మా పార్టీ నుంచి ప్రేరణ పొందింది. మేము మా మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి, ఉచిత రేషన్ వంటి హామీలు ఇచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మా మేనిఫెస్టోనే అనిసరించింది. ఎన్నికల ప్రచారంలో అవే వాగ్ధానాలను చేసింది. ఇతర పార్టీలు కూడా విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారించాయి. దేశ రాజకీయాల ముఖచిత్రాన్ని మార్చడంలో ఆప్ విజయం సాధించింది’ అని అన్నారు.
మే 4, 11 తేదీల్లో ఉత్తరప్రదేశ్లో రెండు దశల్లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు నగర పాలిక చైర్పర్సన్ స్థానాలు, ఆరు నగర పంచాయతీ చైర్ పర్సన్ స్థానాలు, ఆరు నగర నిగమ్ కౌన్సిలర్ స్థానాలతోపాటు పలు వార్డులను గెలుచుకుంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన ఆప్ నాయకులను కేజ్రీవాల్ అభినందించారు.
Also Read..
Virat Kohli | ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఔట్.. కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ.. పిక్ వైరల్
ICE Apple | తాటిముంజలతో తక్షణ శక్తి.. చలువతో పాటు ఆరోగ్యానికి మేలు
PM Modi | మోదీ పాలనలో ధరల భారం.. సామాన్యుల బతుకు ఛిద్రం చేసిన కేంద్రం