ICE Apple | తాటిముంజలతో తక్షణ శక్తి.. చలువతో పాటు ఆరోగ్యానికి మేలు
వేసవి ప్రత్యేక ఫలాల్లో ఒకటైన తాటిముంజ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటుంది. ముంజలోపల తియ్యని నీరుంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే దీన్ని ఐస్ యాపిల్ అంటారు. ముంజల్లో నీటి శాతం ఎక్కువ.
ICE Apple | వేసవి ప్రత్యేక ఫలాల్లో ఒకటైన తాటిముంజ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటుంది. ముంజలోపల తియ్యని నీరుంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే దీన్ని ఐస్ యాపిల్ అంటారు. ముంజల్లో నీటి శాతం ఎక్కువ. వేసవిలో డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి మేలు చేసే తాటిముంజలపై ప్రత్యేక కథనం..
– సిద్దిపేట రూరల్, మే 21
భానుడి భగభగ నుంచి ఉపశమనం పొందేందుకు శీతలపానీయాలు ఏమేరకు మేలు చేస్తాయో చెప్పలేం కానీ, ఎండకాలంలో లభించే తాటిముంజలు మాత్రం ఆరోగ్యంతోపాటు చల్లదనాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. తాటిముంజల్లో ఉండే పోషకాలు వేసవి వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తూ పలు అనారోగ్య సమస్యలకు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. మండు వేసవిలో మాత్రమే ఈ ఐస్ యాపిల్స్ లభించడం విశేషం.
తాటిముంజల్లో లభించే పోషకాలు..
- విటమిన్ బీ-7, విటమిన్ కే, సోలెబుల్ ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, విటమిన్-ఏ, విటమిన్-సీ, విటమిన్-డీ, జింక్, ఐరన్‌లతో పాటు న్యూట్రిన్స్ ఉంటాయి.
- పొటాషియం సమృద్ధిగా ఉండడంతో రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ్యాలను తొలిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
- వేసవిలో లభించే తాటిముంజల్ని రోజూ తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తాటిముంజలు తినడంతో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.
- జీర్ణ సంబంధ సమస్యను తగ్గిస్తాయి. ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరంగా ఉండే ఉదర సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.
- వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే శరీరంలోని అధిక బరువును తగ్గించేందుకు తాటిముంజలు ఎంతో సహాయపడతాయి.
- తాటిముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మానికి కావాల్సిన తేమను అందించి వేసవికాలంలో వచ్చే చెమటకాయని నివారిస్తుంది. అలాగే ఎండవేడిమితో ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.

డజన్ లెక్కన..
తాటిముంజలను ఇష్టపడని వారుండరు. ఎండకాలం వచ్చిందంటే చాలు రోడ్డు పక్కన తాటిముంజలను విక్రయిస్తుంటారు. వీటిని తింటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్నిస్తాయి. తాటిముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి. గ్రామాల నుంచి తీసుకువచ్చి వీటిని విక్రయిస్తారు. పట్టణాల్లో డజన్ తాటిముంజలు రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. తాటిముంజల్లో నీటిశాతం అధికంగా ఉంటుంది. వేసవిలో నాలుగు ముంజలు తింటే డీహైడ్రేషన్ నుంచి విముక్తి కలుగుతుంది. ముంజలను చిన్న ముక్కలుగా కోసి స్వీట్లు, లస్సీ, జ్యూస్, సలాడ్లతోపాటు చికెన్, మటన్‌లో వేసుకుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ బీ, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వికారం, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బందిగా ఉన్నప్పుడు తాటిముంజలు తింటే ఉపశమనం లభిస్తుంది. సీజనల్‌గా లభించే పండ్లను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- calcium
- Fiber
- Palm trees
- Potassium
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

