PM Modi: కాంగ్రెస్ దుకాణంకు త్వరలో తాళం: ప్రధాని మోదీ
PM Modi: దేశంలో విపక్ష పార్టీలు అధ్వాన్న స్థితికి చేరడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని మోదీ అన్నారు. ఇతర విపక్షాలను ఆ పార్టీ ఎదగనివ్వలేదన్నారు. కుటుంబ పాలనకే ప్రాధాన్యత ఇచ్చిన ఆ పార్టీ దుకాణాన్ని మూసివేసుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్యాన్సల్ కల్చర్ పెరిగిందన్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఇవాళ లోక్‌సభలో ప్రధాని మోదీ (PM Modi)మాట్లాడారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో సెనగోల్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సంఘటనలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. విపక్షాల చర్యలు విచిత్రంగా ఉన్నాయని, సుదీర్ఘ కాలం విపక్షంలోనే ఉండాలని ఆ పార్టీలు భావిస్తున్నాయని ప్రధాని ఆరోపించారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యాన్ని విపక్ష సభ్యులు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. దేశం సాధించిన ప్రగతిని రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో వినిపించారన్నారు.
#WATCH | PM Modi attacks Congress, Rahul Gandhi, says, “Ek hi product baar-baar launch karne ke chakkar mein, Congress ki dukaan tala lagne ki naubat aa gayi hai…” pic.twitter.com/uGtG3kALQO
— ANI (@ANI) February 5, 2024
దేశానికి చెందిన నాలుగు స్తంభాలను తన ప్రసంగంలో ఆమె ఫోకస్ చేశారన్నారు. పిల్లర్లు ఎంత దృఢంగా ఉంటే, దేశం అంత వేగంగా వృద్ధి సాధిస్తుందని రాష్ట్రపతి భావించినట్లు ప్రధాని వెల్లడించారు. దేశంలో విపక్షం బలహీనంగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన అన్నారు. గడిచిన పదేళ్లలో బలమైన ప్రతిపక్షంగా మారేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చిందని, కానీ వాళ్లు ఏమాత్రం ఎదగలేదని, అంతేకాదు ఇతర విపక్ష పార్టీలను కూడా ఎదగకుండా చేశారని ఆయన విమర్శించారు.
#WATCH | As an Opposition MP raised the issue of there not being anything for minorities in President’s Address, PM Narendra Modi says, “Maybe fishermen are not from the minority in your place, maybe animal herders are not from the minority in your place, maybe farmers are not… pic.twitter.com/3j46LE7ZRA
— ANI (@ANI) February 5, 2024
కాంగ్రెస్ పార్టీ దుకాణాన్ని మూసివేస్తున్నామని, త్వరలోనే ఆ దుకాణంకు తాళాలు వేస్తామన్నారు. మరోసారి ప్రధాని మోదీ కుటుంబ పాలనపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబానికి మించి ఎక్కువగా ఆలోచించలేకపోయిందన్నారు. ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది మోదీ గ్యారెంటీ అంటూ ప్రధాని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

