Congress | మోదీ ఇంటి పేరు కేసు (Modi surname remark)లో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సుప్రీం కోర్టు (Supreme Court)లో ఊరట లభించిన విషయం తెలిసిందే. గతంలో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసు (Defamation Case)లో గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. అలాగే వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు వీలు కల్పించింది.
కాగా, సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘ఈ తీర్పు ద్వేషంపై ప్రేమ సాధించిన విజయం. సత్యమేవ జయతే – జైహింద్’ అని ట్వీట్ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ అగ్రనేత పి చిదంబరం కూడా స్పందించారు. న్యాయస్థానం తీర్పుతో రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని స్పీకర్ ను కోరారు.
కాగా, 2019 ఏప్రిల్ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది?’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దీనిపై సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఆ మరునాడు ఆయనపై అనర్హత వేటు వేశారు.
మరోవైపు జైలు శిక్షపై స్టే కోసం రాహుల్ గాంధీ ట్రయల్ కోర్టుతోపాటు గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. ఫలితం లేకపోవడంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఊరట ఇచ్చింది. రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షపై స్టే విధించడంతోపాటు ఎంపీ హోదాను పునరుద్ధరించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
यह नफरत के खिलाफ मोहब्बत की जीत है।
सत्यमेव जयते – जय हिंद 🇮🇳 pic.twitter.com/wSTVU8Bymn
— Congress (@INCIndia) August 4, 2023
Also Read..
Rahul Gandhi | రాహుల్‌కు ఊరట.. జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే, ఎంపీ హోదా పునరుద్ధరణ
Indian Student | భారత్‌ను వదిలి రావడం నా కల అని ట్రోల్స్‌కు గురైంది.. బంపర్ ఆఫర్ కొట్టేసింది
Kedarnath Yatra | కేదార్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. పలువురు గల్లంతు