గువాహతి: అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జోర్హాట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన ఆయన మొదటి ప్రయత్నంలోనే ఓడిపోయారు. (Gaurav Gogoi) 2024 లోక్‌సభ ఎన్నికల్లో జోర్హాట్ ఎంపీగా గౌరవ్ గొగోయ్ ఎన్నికయ్యారు. బీజేపీకి చెందిన టోపోన్ కుమార్ గొగోయ్‌పై 1.4 లక్షల ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు.
కాగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి జోర్హాట్ అసెంబ్లీ స్థానం నుంచి గౌరవ్ గొగోయ్ పోటీ చేశారు. తన గెలుపుతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే బీజేపీకి చెందిన హితేంద్ర నాథ్ గోస్వామి చేతిలో 20,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.
మరోవైపు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్ర నాథ్ గోస్వామి వరుసగా ఆరుసార్లు జోర్హాట్ నియోజకవర్గంలో గెలిచారు. ఏజీపీ నేతగా మూడుసార్లు, బీజేపీ ఎమ్మెల్యేగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కూడా జోర్హాట్లో గెలుపును బీజేపీకి అందించారు. అలాగే ఆ పార్టీ తరుఫున వరుసగా మూడో విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. 59,000కు పైగా ఓట్లు సాధించారు.
Also Read:
S A Chandrasekhar | టీవీకేతో చేతులు కలపండి.. కాంగ్రెస్‌కు విజయ్ తండ్రి సూచన
Election results | కనిపించని తాళాలు.. ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్ లాక్ పగులగొట్టిన అధికారులు
TN Election Results | తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. బోసిపోయిన డీఎంకే కార్యాలయం..!