S A Chandrasekhar | టీవీకేతో చేతులు కలపండి.. కాంగ్రెస్కు విజయ్ తండ్రి సూచన
S A Chandrasekhar | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధికారం దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధికారం దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ (S A Chandrasekhar) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అధికారాన్ని కోల్పోవడం, పొత్తుల మార్పులు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణమని చంద్రశేఖర్ తెలిపారు. ‘కాంగ్రెస్కు ఒక చరిత్ర, సంప్రదాయం ఉన్నాయి. అటువంటి కాంగ్రెస్ ఎందుకు క్షీణిస్తోంది? అధికారం లేకపోవడం వల్లే’ అని ఆయన అన్నారు.
కాగా, మరో పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ క్షీణిస్తున్నదని చంద్రశేఖర్ తెలిపారు. తమతో చేతులు కలిపితే ఆ అధికారం తిరిగి దక్కుతుందని చెప్పారు. ‘ఆ అధికారాన్ని మేం ఇస్తాం. మేం కాదు, విజయ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఆ అధికారం లభిస్తే, కాంగ్రెస్ తన చరిత్రను నిలబెట్టుకోగలదు. వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు.
మరోవైపు సమాజం, తమిళ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని చాలా కాలంగా విజయ్ ఆలోచిస్తున్నట్లు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తెలిపారు. ‘గత 30 ఏళ్లుగా, సమాజం కోసం, తమిళ ప్రజల కోసం తాను ఏదో ఒకటి చేయాలని ఆయన భావిస్తూ వచ్చారు. ఆ ఆలోచన ఆయన మనసులో ఎప్పుడూ ఉండేది. క్రమంగా ఈ కార్యక్రమాలను రూపొందించుకుంటూ వచ్చారు’ అని అన్నారు.
అలాగే, విజయ్ భవిష్యత్తుపై చంద్రశేఖర్ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు, ‘ఈ రోజు, ఆయనే (విజయ్) తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు’ అని ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Chennai, Tamil Nadu: On TVK, currently leading in 110 seats of the total 234 in the state, TVK chief Vijay’s father, SA Chandrasekhar, says, “… In the last 30 years, he had been thinking that he had to do something for society, for the Tamil people. It was there in his… pic.twitter.com/dF9sWG5RHI
— ANI (@ANI) May 4, 2026
Also Read:
Yanam | యానాంలో ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి కృష్ణారావు
Election results | కనిపించని తాళాలు.. ఈవీఎం స్ట్రాంగ్రూమ్ లాక్ పగులగొట్టిన అధికారులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

