Joseph Vijay | తమిళనాడులో విజయ్ పార్టీ బ్లాక్‌బస్టర్ హిట్.. స్టార్ నుంచి సీఎం దాకా.. 49 ఏళ్ల తర్వాత కొత్త రికార్డు
Joseph Vijay : విజయ్.. 49 ఏళ్ల తర్వాత రాజకీయాల్లో కొత్త రికార్డు నెలకొల్పనున్నాడు. అదే ఎంజీఆర్ తర్వాత స్టార్‌గా ఉండి, పార్టీ స్థాపించి, ఆ తర్వాత వెంటనే సీఎం కావడం. ఇది తమిళనాడుకు సంబంధించిన రికార్డు మాత్రమే.
Joseph Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాలకు దగ్గరగా లీడ్‌లో ఉంది. టీవీకే అధికారంలోకి రావడం, విజయ్ తమిళనాడు సీఎం కావడం ఖాయం. ఈ నేపథ్యంలో విజయ్.. 49 ఏళ్ల తర్వాత రాజకీయాల్లో కొత్త రికార్డు నెలకొల్పనున్నాడు. అదే ఎంజీఆర్ తర్వాత స్టార్‌గా ఉండి, పార్టీ స్థాపించి, ఆ తర్వాత వెంటనే సీఎం కావడం. ఇది తమిళనాడుకు సంబంధించిన రికార్డు మాత్రమే.
తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న ఎంజీఆర్ (ఎం.జీ.రామచంద్రన్) 1977లో ఏఐఏడీఎంకే అనే పార్టీని స్థాపించారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికారు. అదే ఏడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆయన సీఎం అయ్యారు. 1987లో ఆయన మరణించేవరకు.. అంటే పదేళ్లపాటు తమిళనాడు సీఎంగా పని చేశారు. తన ఫ్యాన్స్‌ను రాజకీయాల్లో ఓటర్లుగా మార్చుకుని ఆయన విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత ఎవరూ తమిళనాడులో నటులుగా వచ్చి సీఎం పదవి చేపట్టలేదు. ఇతరులు పార్టీలు స్థాపించినప్పటికీ, ఎంజీఆర్‌లా విజయం సాధించలేదు.
1977 నుంచి ఇప్పటివరకు 49 ఏళ్లలో తమిళ సినీ నేపథ్యం నుంచి ఎవరూ రాజకీయాల్లో అనుకున్నంతగా రాణించలేకపోయారు. నటిగా ఉన్న జయలలిత సీఎం అయ్యారు. కానీ, ఆమె సొంతంగా పార్టీ పెట్టలేకపోయారు. ఏఐఏడీఎంకే పార్టీలోనే ఎదిగి, ఆ పార్టీ తరఫునే సీఎం అయ్యారు. అయితే, జయలలిత మరణించేవరకు బలమైన రాజకీయనేతగా ఉన్నారు. తమిళనాడులో విజయ్ కాంత్, కమల్ హాసన్ వంటి వారు పార్టీ స్థాపించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ స్థాపించే ఆలోచనల్ని విరమించుకున్నారు. కానీ, విజయ్ మాత్రం టీవీకే పార్టీ స్థాపించారు.
సొంతంగా పోటీ చేసి, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. సినిమా నటులకు తమిళనాడులో ఉన్న ఆదరణకు ఆయన విజయం ఒక ఉదాహరణ. దీంతో తమిళనాడులో 49 ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమ నుంచి ఒక స్టార్ స్థాపించిన పార్టీ అధికారంలోకి రాబోతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

