PM Modi: భారత భూభాగాన్ని శత్రువులకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీయే: ప్రధాని మోదీ
PM Modi: భారీ మొత్తంలో భారత భూభాగాన్ని కాంగ్రెస్ పార్టీ శత్రు దేశాలకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. దేశ సైనిక దళాలను కాంగ్రెస్ పార్టీ ఆధునీకరించలేదన్నారు. అలాంటి పార్టీ జాతీయ భద్రత, దేశ అంతర్గత భద్రత గురించి మాట్లాడుతుందా అని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: మన దేశ భూభాగాన్ని భారీ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ శత్రు దేశాలకు అప్పగించిందని ప్రధాని మోదీ (PM Modi)ఆరోపించారు. ఇవాళ రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడారు. దేశ సైనిక దళాలను కాంగ్రెస్ పార్టీ ఆధునీకరించలేదన్నారు. అలాంటి పార్టీ జాతీయ భద్రత, అంతర్గత భద్రత గురించి మాట్లాడుతుందా అని ఆయన అన్నారు. స్వాతంత్య్రం అనంతరం పరిశ్రమలు అవసరమా లేక వ్యవసాయం అవసరమా అన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడిందన్నారు. జాతీయవాదం కావాలా లేక ప్రైవేటీకరణ కావాలన్న అంశాన్ని కూడా ఆ పార్టీ తేల్చుకోలేకపోయిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో 12వ స్థానం నుంచి 11వ స్థానానికి తీసుకువచ్చిందని, కానీ తమ పార్టీ పదేళ్లలో అయిదవ స్థానానికి తీసుకువచ్చిందన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi says “…The Congress that handed over a large part of our land to our enemies, the Congress which stopped the modernisation of the country’s armies, is today giving us speeches on national security and internal security, the Congress which,… pic.twitter.com/PJuvfHTtLZ
— ANI (@ANI) February 7, 2024
ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి రిజర్వేషన్ ఇవ్వలేదన్నారు. జనరల్ క్యాటగిరీలో ఉన్న పేదలకు రిజర్వేషన్ ఇవ్వలేదన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్‌కు భారత రత్న ఇచ్చేందుకు వెనుకాడిందన్నారు. కేవలం తమ కుటుంబసభ్యులకు మాత్రమే భారత రత్న ఇచ్చే ప్రయత్నం చేసిందన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ తమకు సామాజిక న్యాయం గురించి పాఠాలు చెబుతోందన్నారు. లీడర్‌గా ఉండే గ్యారెంటీ లేని వ్యక్తి మోదీ గ్యారెంటీ గురించి ప్రశ్నిస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

