Jairam Ramesh | కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం (New Parliament Building)పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తీవ్ర విమర్శలు చేశారు. ఆ బిల్డింగ్‌ని పార్లమెంట్ భవనం అనే కన్నా ‘మోదీ మల్టీప్లెక్స్’ ( Modi Multiplex) లేదా ‘మోదీ మారియట్’ అని పిలవడం మంచిది అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా పాత పార్లమెంట్‌తో పోలిస్తే కొత్త పార్లమెంట్ భవనం రూపకల్పనలో చాలా లోపాలు గుర్తించినట్లు చెప్పారు. కొత్త భవనం సౌకర్యవంతంగా లేదని పేర్కొన్నారు. సభల మధ్య నడిచేందుకు పాత భవనంలో చాలా సులువుగా ఉండేదని, ఇక్కడ మాత్రం అంతా ఇరుగ్గా ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.
‘కొత్త పార్లమెంట్ భవనాన్ని మోదీ సర్కార్ గొప్ప ప్రచారంతో ప్రారంభించింది. చాలా హైప్‌తో ప్రారంభించిన ఈ భవనం వాస్తవానికి ప్రధానమంత్రి లక్ష్యాలను బాగా గ్రహించింది. అందుకే కొత్త భవనాన్ని పార్లమెంట్ అనడం కన్నా ‘మోదీ మల్టీప్లెక్స్’ లేదా ‘మోదీ మారియట్’ అంటే మంచిది. నాలుగు రోజుల పాటు ఆ పార్లమెంట్‌కి వెళ్తే కానీ అర్థం కాలేదు ఎంత ఇరుగ్గా ఉందో. ఉభయ సభల్లోనూ, ఆవరణలోనూ ఇదే పరిస్థితి. ఇక లాబీల్లో అనవసరమైన చర్చలు జరుగుతున్నాయి. ఆర్కిటెక్చర్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తే, అలిఖిత రాజ్యాంగాన్ని నాశనం చేయడంలో ప్రధాని మోదీ విజయం సాధించారు.
కొత్త పార్లమెంట్లో కూర్చున్న సభ్యులు ఒకరినొకరు చూసుకోవడానికి బైనాక్యులర్స్ వాడాలి. ఎందుకంటే హాల్స్ అస్సలు సౌకర్యవంతంగా లేవు. పాత పార్లమెంట్ బిల్డింగ్ ఎన్నో చరిత్రాత్మకమైన చర్చలకు వేదికగా నిలిచింది. పాత భవనంలో సభ్యుల మధ్య కమ్యూనికేషన్ కూడా సౌకర్యంగా, రెండు సభల మధ్య నడవడానికి ఎంతో అనువుగా ఉండేది. కొత్త భవనంలో అస్సలు సౌకర్యవంతంగా అనిపించలేదు. పాత భవనంలో ఎవరైనా తప్పిపోయినట్లయితే.. అది వృత్తాకారంలో ఉన్నందున సులువుగా దారి గుర్తించొచ్చు. కానీ, కొత్త బిల్డింగ్‌లో పొరపాటున దారి తప్పితే అంతే.. వెనక్కి వచ్చేందుకు కూడా వీలులేదు. అంతా కన్ఫ్యూజన్గా ఉంది.
పార్టీలకు అతీతంగా నా సహచర ఎంపీలు చాలా మంది అలాగే భావిస్తున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అసలు ఈ బిల్డింగ్ నిర్మించేటప్పుడు సరైన విధంగా సలహాలు తీసుకోలేదని మాకు సమాచారం అందింది. మా వాళ్లందరి అభిప్రాయం కూడా ఇదే. 2024లో మోదీ ప్రభుత్వం మారాక కానీ ఈ కొత్త భవనాన్ని సరైన విధంగా వినియోగించుకునే అవకాశముండదు’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
The new Parliament building launched with so much hype actually realises the PM’s objectives very well. It should be called the Modi Multiplex or Modi Marriot. After four days, what I saw was the death of confabulations and conversations—both inside the two Houses and in the…
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 23, 2023
Also Read..
Justin Trudeau | భారత్-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. అమెరికా మొగ్గు ఎవరివైపంటే..?
Rat Bitese | 6 నెలల పసికందుపై ఎలుకల గుంపు దాడి.. ఎముకలు బయటకు వచ్చేలా కొరికి తినేసిన వైనం
Kamal Haasan | చిన్నపిల్లాడైన ఉదయనిధిని అంతా టార్గెట్ చేశారు.. సనాతన ధర్మంపై కమల్‌హాసన్