Arvind Kejriwal | బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యానించారు.
పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందంటూ ఆ రాష్ట్రానికి చెందిన కొందరు మహిళలు శనివారం కేజ్రీవాల్ నివాసం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ కేజ్రీ, పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలపై స్పందించిన కేజ్రీవాల్.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రెండు పార్టీలూ కావాలనే కూటమిగా ఏర్పడి తమపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు.
‘నా నివాసం వద్ద ఆందోళన చేసిన మహిళలు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఆ రెండు పార్టీలకూ (బీజేపీ, కాంగ్రెస్) చెందిన వారే. పంజాబ్ ప్రజల మద్దతు మాకే ఉంది. మాపై వారికి పూర్తి విశ్వాసం ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌పై కలిసి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్-బీజేపీ అధికారికంగా ప్రకటించాలి’ అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
Also Read..
Delhi Elections | ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ తొలిజాబితా రిలీజ్.. కేజ్రీవాల్‌పై మాజీ ఎంపీ పోటీ
Army truck | లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి
Cold wave | ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీలో 250 విమానాలు ఆలస్యం