Army truck | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ వాహనం (Army truck) అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు (soldiers killed) కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.
బందిపూర్ (Bandipore) జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సదర్ కూట్ పాయెన్ (Sadar Koot Payen) సమీపంలోని ఓ వంపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అప్రత్తమైన భద్రతా బలగాలు, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కశ్మీర్ లోయలో ఇలా ఆర్మీ వాహనాలు ప్రమాదానికి గురి కావడం ఇదేమీ తొలిసారి కాదు. గతేడాది డిసెంబర్ 24వ తేదీన పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనం అదుపుతప్పి 350 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ఉగ్రకోణం లేదని ఆర్మీ స్పష్టం చేసింది. అంతకుముందు నవంబర్ 4న రాజౌరి జిల్లాలో వాహనం స్కిడ్ అయి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆర్మీ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
Delhi Elections | ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ తొలిజాబితా రిలీజ్.. కేజ్రీవాల్‌పై మాజీ ఎంపీ పోటీ
Viral Video | ఫార్చునర్ కారుతో ప్రమాదకర స్టంట్స్.. షాకిచ్చిన పోలీసులు
Yuzvendra Chahal | మరో స్టార్ జంట విడాకులు.. ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో..!