Viral Video | ప్రస్తుత సమాజంలో రీల్స్ ట్రెండ్ (Shoot Reel) నడుస్తోంది. ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్లు ఉండటంతో.. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలని చూస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడేసుకుంటున్నారు. ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం..? అవేవీ పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా నోయిడా (Noida)కు చెందిన ముగ్గురు వ్యక్తులు కారుతో ప్రమాదకర స్టంట్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది (Viral Video).
టొయోటా ఫార్చునర్ (Toyota Fortuner) కారుపై ఓ వ్యక్తి విండ్షీల్డ్పై కూర్చున్నారు. మరో ఇద్దరు రెండు వైపులా కారు డోర్లకు వేలాడుతూ కనిపించారు. ‘స్క్విడ్ గేమ్స్’ నోయిడా ఎడిషన్‌కు చెందిన స్పిన్ ఆఫ్ షూట్ (Squid Games Song) చేశారు. అర్ధరాత్రి సమయంలో స్టంట్స్ ప్రదర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వీడియో ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ వారికి పోలీసులు రూ.33,000 చలాన్ విధించారు.
#Noida #BJP झंडा लगी फॉरच्यूनर कार पर लटककर #Reel बनवाई pic.twitter.com/uJKGGe4oZr
— News & Features Network (@newsnetmzn) January 4, 2025
Also Read..
Tamil Nadu | పటాకుల పరిశ్రమలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం
Cold wave | ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీలో 250 విమానాలు ఆలస్యం