అహ్మదాబాద్: పాకిస్థాన్‌కు చెందిన బోటు భారత జలాల్లోకి ప్రవేశించింది. దీంతో కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. షిప్ ద్వారా అడ్డుకున్నది. పాక్ బోటును స్వాధీనం చేసుకున్నది. అందులో ఉన్న 11 మందిని అదుపులోకి తీసుకున్నది. (Coast Guard Seizes Pak Boat) గుజరాత్ తీరంలోని సముద్ర జలాల్లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 10న పాకిస్థాన్‌కు చెందిన మత్స్యకారుల పడవ భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. భారత తీర రక్షక దళం (ఐసీజీ) దీని గుర్తించింది. కోస్ట్ గార్డ్ సిబ్బంది ఒక నౌకలో అక్కడకు చేరుకున్నారు. పాక్ బోటును అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 11 మంది పాక్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కోసం జఖావ్ మెరైన్ పోలీసులకు వారిని అప్పగించినట్లు గుజరాత్ రక్షణ శాఖ పీఆర్వో వింగ్ కమాండర్ అభిషేక్ కుమార్ తివారీ తెలిపారు.
కాగా, ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా దీనిని ధృవీకరించింది. అచంచలమైన అప్రమత్త, సముద్ర సరిహద్దులను రక్షించడానికి, అంతర్జాతీయ సముద్ర చట్టం పర్యవేక్షణలో భారత్ దృఢ సంకల్పాన్ని తమ చర్య ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. అవిశ్రాంత నిఘా, చురుకైన ఆపరేషన్ సముద్ర భద్రతా వ్యూహానికి పునాది అని వెల్లడించింది.
Also Read:
Mamata Banerjee | ‘సర్’లో పేర్లు తొలగిస్తే.. వంటగది వస్తువులతో మహిళలు పోరాడాలి: మమతా బెనర్జీ
Man Branded Untouchable | దళిత ఇంట్లో భోజనం చేసిన వ్యక్తి.. ‘అంటరానివాడు’గా ముద్ర, అతడి కుటుంబం వెలి
Watch: మత్తులో యువకులు హంగామా.. స్కూల్ బస్సును అడ్డుకుని బాలికను దించాలని బలవంతం