Supreme Court | ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో గల ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) గత నెల 27 శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో సివిల్స్ అభ్యర్థుల మృతిపై సుప్రీంకోర్టు (Supreme Court) సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా కోచింగ్ సెంటర్లను సుప్రీం ధర్మాసనం ‘డెత్ ఛాంబర్స్’గా (death chambers) అభివర్ణించింది. అభ్యర్థుల జీవితాలతో కోచింగ్ సెంటర్లు ఆడుకుంటున్నాయని వ్యాఖ్యానించింది. ఈ ఘటన ఓ కనువిప్పు లాంటిదని పేర్కొంది. అన్ని భద్రతా ప్రమాణాలను పాటించే కోచింగ్ సంస్థలకే అనుమతులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రావూస్ ఘటన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ.. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
బేస్మెంట్లోకి వరద.. ముగ్గురు విద్యార్థులు జలసమాధి
ఢిల్లీ (Delhi)లోని ఓల్డ్ రాజేందర్ నగర్ (Old Rajinder Nagar)లో గల ఓ కోచింగ్ సెంటర్లోకి (Coaching Centres) వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో (Coaching Centre) గత నెల 27 శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు. లైబ్రరీ డోర్‌కు బయోమెట్రిక్ వ్యవస్థ ఉందని, ఇది లాక్ అయిపోవడం వల్లే వీరు బయటకు రాలేకపోయారని పలువురు విద్యార్థులు చెప్తున్నారు.
Also Read..
Kedarnath | కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన 133 మంది యాత్రికులను రక్షించిన ఐఏఎఫ్
Pakistan posters | ఓ వ్యక్తి ఇంట్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం
Article 370 | ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి.. జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్