Kedarnath | ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. క్లౌడ్ బస్ట్‌తో రాష్ట్రంలో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో రోడ్లు, వంతెనలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ (Kedarnath) సందర్శనకు వెళ్లిన యాత్రికులు ఈ వరదలకు అక్కడ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వందలాది మంది యాత్రికులు కేదార్నాథ్ మార్గంలో చిక్కుకుపోయారు.
దీంతో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం (IAF), ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేదార్నాథ్ లోయలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తరలిస్తున్నారు. ఎమ్-17, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్లు, చినూక్ హెలికాప్టర్లు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. సుమారు 133 యాత్రికులను ఐఏఎఫ్ దళం ఇవాళ ఉదయం రక్షించింది.
#IAF helicopters leapt into action, resuming the Rescue Operations at Kedarnath after an impatient wait due poor weather in the valley.
A total of eight NDRF personnel and a load of 800 kg have been inducted with 94 persons rescued including children and patients, today.… pic.twitter.com/M6i5NETieG— Indian Air Force (@IAF_MCC) August 5, 2024
Also Read..
Pakistan posters | ఓ వ్యక్తి ఇంట్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం
Article 370 | ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి.. జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్
Kanwariyas | కన్వర్ యాత్రలో విషాదం.. కరెంట్ షాక్‌తో 9 మంది భక్తులు మృతి