Pakistan posters | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు (Pakistan Slogans) ఒక్కసారిగా కలకలం రేపాయి. రోహిణి ప్రాంతంలోని (Rohini Area) ఓ వ్యక్తి ఇంట్లో ‘లాంగ్ లైవ్ పాకిస్థాన్’ (Long Live Pakistan) అని రాసి ఉంది. ఇది చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
రోహిణిలోని అవంతిక సి-బ్లాక్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన ఫ్లాట్ గోడపై పాకిస్థాన్ అనుకూల నినాదాలు రాశాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్థానిక పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సదరు వ్యక్తికి పాకిస్థాన్‌తో, మరేదైనా గ్రూపుతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆ వ్యక్తి గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అతని బంధువులను సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అతడి ఫ్లాట్ నుంచి అభ్యంతరకర పోస్టర్లు, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Also Read..
Article 370 | ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి.. జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్
Emergency Landing | ప్రయాణికురాలి తలలో పేలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Iran | ఈరోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి..?