Emergency Landing | ప్రయాణికురాలి తలలో పేలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Emergency Landing | అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలోని (American Airlines Flight) ప్రయాణికులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ మహిళా ప్రయాణికురాలి తలలో పాకుతున్న పేలు (Lice In Womans Hair) విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేసేలా చేశాయి.
Emergency Landing | అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలోని (American Airlines Flight) ప్రయాణికులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. సాధారణంగా ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితోనో, ప్రయాణికుల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సాయం అవసరమైతేనో, బాంబు బెదిరింపులు, వాతావరణం సహకరించకపోవడం వంటివి జరిగినప్పుడు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేయడం చూస్తుంటాం. అయితే, ఇక్కడ ఓ మహిళా ప్రయాణికురాలి తలలో పాకుతున్న పేలు (Lice In Womans Hair) విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేసేలా చేశాయి. ఈ ఘటన జూన్‌లో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్‌కు వెళ్తోంది. విమానం గాల్లో ఉండగా.. ఓ మహిళ తలలో పేలు పాకుతుండటాన్ని చూసిన తోటి ప్రయాణికులు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో విమానాన్ని ఫీనిక్స్‌లో (Phoenix) ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎథాన్ జుడెల్సన్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని ‘టిక్‌టాక్’ ద్వారా పంచుకున్నాడు.
‘విమానాన్ని మళ్లిస్తున్నట్టు మాత్రమే విమాన సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. నేను చుట్టూ చూశాను. ఎవరూ భయపడడం లేదు. అయినా విమానం ల్యాండ్ అయింది. ఆ వెంటనే ఓ మహిళ విమానం ముందువైపునకు దూసుకెళ్లింది. ఆ తర్వాత విమానం ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందని తోటి ప్రయాణికుడిని అడిగితే అసలు విషయం తెలిసింది. ఓ మహిళ తలలో పేలు పాకుతుండటాన్ని ఇద్దరు ప్రయాణికులు చూసి విమాన సిబ్బందికి చెప్పారట. వారొచ్చి చూస్తే నిజంగానే ఆమె తలలో పేలు పాకుతుండటంతో.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు’ అని సదరు ప్రయాణికుడు వివరించారు. ఈ ఘటన కారణంగా విమానం 12 గంటలు ఆలస్యమైనట్లు చెప్పారు. అప్పటి వరకు ప్రయాణికులకు విశ్రాంతి తీసుకునేందుకు హోటల్ సదుపాయాన్ని కల్పించినట్లు వివరించారు.
Also Read..
Iran | ఈరోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి..?
Nandhyal | దుస్తులు విప్పదీసి.. రహదారిపై ఈడ్చుకెళ్లి.. విద్యార్థులపై తాగుబోతుల దాడి
Noah Lyles: ఉత్కంఠ రేపిన 100 మీటర్ల ఫైనల్.. ప్రపంచ చాంపియనే.. ఒలింపిక్స్ ఫాస్టెస్ట్ రన్నర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

