Nandhyal | నంద్యాల పట్టణ శివారులో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులపై కొంతమంది తాగుబోతులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆగస్టు 1వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నంద్యాల పట్టణ శివారులో ఆగస్టు 1వ తేదీన ఎస్డీఆర్ పాఠశాల చైర్మన్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తున్న ఓ ఇంటర్ విద్యార్థిని కొంతమంది దుండగులు అడ్డగించి, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బు వ్విద్యార్థి చెప్పడంతో అతనిపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి తనకు తెలిసిన బీటెక్ విద్యార్థి లోకేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి జరిగిందంతా వివరించాడు.
సాయం చేయడానికి వచ్చిన బీటెక్ విద్యార్థి లోకేశ్వర్ రెడ్డిపై దుండగులు దాడికి తెగబడ్డారు. డబ్బులివ్వాలని అడిగితే.. నువ్వెందుకొచ్చావ్ అని అతనిపైనా దాడి చేశారు. దుస్తులు విప్పదీసి రహదారిపై ఈడ్చుకెళ్లడంతో పాటు ఛాతీపై కూర్చొని కొట్టారు. లోకేశ్వర్ చెవిని కూడా కొరికారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకునన దుండుగులు పోలీసులను ఆశ్రయించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుబ్బయ్య, శంకర్ సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం నంద్యాల రూరల్ పోలీసులు గాలిస్తున్నారు.