పారిస్ : ప్రపంచ చాంపియన్ నోహ లైల్స్.. పారిస్ ఒలింపిక్స్ పురుషుల 100 మీటర్ల రేస్‌ను గెలిచాడు. అత్యంత వేగవంతమైన వీరుడిగా నిలిచాడతను. ఆదివారం జరిగిన ఫైనల్ రేస్ ఉత్కంఠ రేపింది. స్ప్రింట్ అథ్లెట్లు నువ్వా నేనా అన్నట్లుగా పరుగు తీశారు. గోల్డ్ మెడల్ విన్నర్ నోహ లైల్స్.. కేవలం 9.79 సెకన్లలో టార్గెట్‌ను చేరుకున్నాడు. ఆధునిక చరిత్రలోనే ఆదివారం జరిగిన పారిస్ రేస్ చాలా అరుదైనది. వంద మీటర్ల చాంపియన్‌ను సెకనులోని 5000వ వంతుతో డిసైడ్ చేశారు. ఫోటో ఫినిష్‌లో జమైకా స్టార్ రన్నర్ కిషేన్ థాంప్సన్ రెండో స్థానంలో నిలిచాడు.
Huge accomplishment for Noah Lyles winning Gold for team USA in the 100m men’s final! Noah is a 200m runner traditionally and he just won in the 100m.
In the Netflix docuseries Sprint, Noah joked with his mom and said “the 200 is my wife and the 100 is my mistress.”
Can’t… pic.twitter.com/OXk3zyT5YE
— Jordan Karr (@JordanLkarr) August 4, 2024
వాస్తవానికి నోహ లైల్స్.. కిషేన్ థాంప్సన్‌లు.. 9.79 సెకన్లలోనే 100 మీటర్ల లక్ష్యాన్ని చేరుకున్నారు. కానీ అమెరికాకు చెందిన నోహ లైల్స్ .. ఆ టార్గెట్ లైన్‌ను .784 సెకన్లలో చేరుకోగా, థాంప్సన్ ఆ టార్గెట్‌ను .789 సెకన్లలో చేరుకున్నారు. దీంతో అమెరికా చిరుతకే స్వర్ణ పతకం దక్కింది. 2004 ఏథేన్ గేమ్స్‌లో జస్టిన్ గాట్లిన్ చివరి సారి అమెరికా తరపున 100 మీటర్ల మెడల్ సాధించాడు. ఆ తర్వాత నోహ .. మళ్లీ ఆ దేశానికి గోల్డ్ మెడల్ అందించాడు.
నోహ్ ఆ రేసులో పర్సనల్ బెస్ట్ టైమింగ్‌ను రికార్డు చేశాడు. ఇదో కష్టతరమైన యుద్ధమని, ప్రత్యర్థులు అద్భుతంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఈ ఫైట్ కోసం అందరూ ప్రిపేరై వచ్చారని, కానీ అందరిలో తానే చాంపియన్ అని నిరూపించాలని ఉందని, తానే తోడేలు అని పేర్కొన్నాడు. ఫోటో ఫినిష్ ద్వారానే లైల్స్ విక్టరీని కన్ఫర్మ్ చేశారు.
A lifetime of preparation and 4 years of training comes down to FIVE ONE THOUSANDTHS OF A SECOND.
0.005 seconds!!!
FIVE milliseconds.
It takes ONE HUNDRED MILLISECONDS TO BLINK! It’s incomprehensiblepic.twitter.com/DGyWyyJ9Ol
— KFC (@KFCBarstool) August 4, 2024