కట్టంగూర్, జనవరి 7 : విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ బుడిగ శ్రీనివాస్ అన్నారు. బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కింగ్ కట్టంగూర్ ఆధ్వర్యంలో హంగర్ సర్వీస్ వీక్లో భాగంగా కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం పాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం మహాలక్ష్మి, శ్రీనివాస్, ఎగ్జిక్యూటీవ్ కో ఆర్డినేటర్ ఎర్ర శివలింగారెడ్డి, లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు చిక్కు శేఖర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, సభ్యులు కడారి మల్లికార్జున్, రాపోలు వెంకటేశ్వర్లు, మంగదుడ్ల శ్రీనివాస్, బొడ్డుపల్లి వెంకన్న పాల్గొన్నారు.