భోపాల్ : కాంగ్రెస్ హయాంలో దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం, అవినీతి, వేర్పాటువాదం, నిరుద్యోగం, కరువు పెచ్చరిల్లాయని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ (Madhya Pradesh Polls) ఆరోపించారు. చింద్వారా వంటి సంపన్న ప్రాంతంలో అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి కాంగ్రెస్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. గత 9 ఏండ్లుగా మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని పరిస్ధితులను చక్కదిద్దిందని అన్నారు.
కాంగ్రెస్ను ఎంత త్వరగా వదిలించుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి అంత వేగంగా పరుగులు పెడుతుందని యోగి ఆదిత్యానాధ్ పిలుపు ఇచ్చారు. చింద్వారాలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ 40 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్లో అభివృద్ధిలో వెనుకపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు చింద్వారా అభివృద్ధిని పక్కనపెట్టి తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం పాకులాడారని ఆరోపించారు.
సనాతన ధర్మం ఉనికిని కాంగ్రెస్ ప్రశ్నించిందని మండిపడ్డారు. దేశ సమగ్రత, ఐక్యత, సౌభాగ్యం కోసం తాము పోరాడుతున్నామని యోగి చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన పిలుపు ఇచ్చారు.
Read More :