Naveen Patnaik | ఒడిశా అసెంబ్లీ (Odisha Assembly) ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అక్కడ బీజేపీ, బిజు జనతాదళ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. అక్కడ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక రాష్ట్ర సీఎం (Odisha CM), బీజేడీ సుప్రిమో నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) సైతం వెనుకంజలో ఉన్నారు. కాంటాబంజి (Kantabanji)లో సీఎం 1,158 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఆయన పోటీ చేసిన రెండో స్థానం హింజిలిలో మాత్రం స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు 147 లోక్‌సభ స్థానాలు ఉన్న ఒడిశాలో.. ప్రస్తుతం బీజేపీ 74 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీజేడీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 13, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
Also Read..
Maneka Gandhi | సుల్తాన్‌పూర్‌లో మేనకా గాంధీ వెనుకంజ
Rahul Gandhi | వయనాడ్‌లో లక్ష ఓట్ల ఆధిక్యంలో రాహుల్.. రాయ్‌బరేలీలోనూ ముందంజే
Ap Elections | వైనాట్ 175 అన్నారు.. ఇప్పుడు 17 కూడా కష్టంగా ఉంది.. ఓటమి అంచున వైసీపీ