Ap Elections | ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వార్ వన్‌సైడ్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ (YSRCP) ఓటమి దాదాపు ఖరారైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 155 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. వైసీపీ కేవలం 16 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది.
ఎన్నికల ముందు ‘వై నాట్ 175’ అన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూసి ఒక్కసారిగా ఖంగుతింటున్నారు. కనీసం జనసేన పార్టీ సాధించినన్ని సీట్లు కూడా చేజిక్కించుకోలేని పరిస్థితి. దీంతో ఆ పార్టీ శ్రేణులు, నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు సైతం ఓటమి బాటలో పయనిస్తున్నారు. చివరి రౌండ్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వైసీపీ నేతలు గెలుపు దిశగా వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు.
బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడదల రజిని, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణు, జోగి రమేశ్ సహా పలువురు కీలక నేతలు ఇప్పటి వరకూ ఓటమి బాటలో ఉన్నారు.
Also Read..
Roja | నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజాకు షాక్
Lok Sabha Polls: టఫ్ ఫైట్ ఇచ్చిన ఇండియా కూటమి.. 300 మార్క్ దాటిన ఎన్డీఏ
Kodali Nani | గుడివాడలో కొడాలి నాని వెనుకంజ