Roja | ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి టీడీపీ-జనసేన కూటమి తన హవా చాటుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి నుంచి 132 (టీడీపీ) స్థానాల్లో, జనసేన 19 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
ఇప్పటివరకున్న సమాచారం మేరకు నగరి అభ్యర్థి, మాజీ మంత్రి ఆర్కే రోజా (Roja Selvamani) నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ 5,640 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.