Rahul Gandhi | లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యధిక మెజారిటీతో దూసుకెళ్తున్నారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఏకంగా లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. కేరళలోని వయనాడ్ (Wayanad)లో రాహుల్ 1,20,206 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా.. ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ (Raebareli)లో బీజేపీ అభ్యర్థిపై 68 వేల ఓట్లకుపైగా ముందంజలో కొనసాగుతున్నారు.
మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను కూడా దాటేసింది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి 294 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి 228 స్థానాల్లో ముందంలో ఉంది.
Also Read..
BJP | పంజాబ్‌లో ఖాతా తెరవని బీజేపీ.. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్
Ap Elections | వైనాట్ 175 అన్నారు.. ఇప్పుడు 17 కూడా కష్టంగా ఉంది.. ఓటమి అంచున వైసీపీ
Odisha Assembly: బీజేడీకి బ్రేకేసిన బీజేపీ !