భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ(Odisha Assembly) ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలుబడుతున్నాయి. ఇన్నాళ్లూ ఎదురులేకుండా సాగిన నవీన్ పట్నాక్ సర్కారుకు ఇప్పుడు బీజేపీ జలక్ ఇచ్చింది. తాజా కౌంటింగ్ సమాచారం ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. 147 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో.. ప్రస్తుతం బీజేపీ 74 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. మరో వైపు బీజేడీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 13, ఇతరులు 3 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు.
బీజూ జనతాదళ్ ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నది. సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఆ ధీమా వ్యక్తం చేశారు. కానీ ఈసారి ఒడిశాపై కన్నేసిన బీజేపీ.. నవీన్ దూకుడుకు బ్రేక్ వేసింది. పట్నాయక్ ప్రభుత్వ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒడిశాలో పనిచేశాయి. కాంటబంజి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నవీక పట్నాయక్ వెనుకంజలో ఉన్నారు.