Coal Mine | బొగ్గు గనిలో ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు మృతి
Coal Mine | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు గని (Coal Mine)లోని సొరంగం పైకప్పు కూలి చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Coal Mine | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు గని (Coal Mine)లోని సొరంగం పైకప్పు కూలి చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ధన్బాద్ ( Dhanbad) జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
బొగ్గును వెలికితీసేందుకు వందలాది మంది కార్మికులు సొరంగంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో సొరంగం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో పడ్డారు.
ఏటీదేవ్ ప్రభ ఔట్సోర్సింగ్ కంపెనీలో (ATDev Prabha Outsourcing company) అక్రమ మైనింగ్ (illegal mining) జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలుకాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Odisha Train Accident | రైలు ప్రమాద మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత
Sharad Pawar | శరద్ పవార్కు హత్య బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన సుప్రియా సూలే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

