Vignesh Shivan | ఎన్నో ఎత్తుపల్లాలు.. ఊహించని ఎదురుదెబ్బలు.. మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా విఘ్నేశ్ ఎమోషనల్ పోస్ట్
Vignesh Shivan | చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ కపుల్స్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) జంట ఒకటి. నేడు నయన్-విఘ్నేశ్ మొదటి వివాహ వార్షికోత్సవం (1st Anniversary) . ఈ సందర్భంగా విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా ద్వారా భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Vignesh Shivan | చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ కపుల్స్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) జంట ఒకటి. సుమారు ఏడేండ్లపాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో గతేడాది జూన్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కాగా, నేడు నయన్-విఘ్నేశ్ మొదటి వివాహ వార్షికోత్సవం (1st Anniversary) . ఈ సందర్భంగా విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా ద్వారా భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
‘నువ్వు నా జీవితంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఈ ఏడాది ఎన్నో క్షణాలతో నిండిపోయింది. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. అనేక ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇంటికి తిరిగొచ్చి నా అందమైన ఫ్యామిలీని చూస్తే.. కోల్పోయిన ఎనర్జీ మొత్తం తిరిగి వస్తుంది. ఫ్యామిలీ ద్వారా వచ్చే కాన్ఫిడెన్స్ వేరే స్థాయిలో ఉంటుంది. కలలు సాకారం చేసుకునే శక్తినిస్తుంది. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్‌లకు మంచి జీవితాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాను’ అంటూ పోస్ట్ పెట్టారు. దీంతోపాటు నయన్ తన ఇద్దరి పిల్లల్ని ఎత్తుకుని ఉన్న క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో గతేడాది జూన్ 9వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ (Uyir RudroNeel N Shivan), ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ (Ulag Daiwik N Shivan) అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం ఈ జంట ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
Also Read..
Sharad Pawar | శరద్ పవార్‌కు హత్య బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన సుప్రియా సూలే
Samantha | రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సమంత.. పిక్స్ వైరల్
Miss World 2023 | దాదాపు మూడు దశాబ్దాల తర్వాత.. మిస్ వరల్డ్ పోటీలకు వేదికకానున్న భారత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

