Miss World 2023 | దాదాపు మూడు దశాబ్దాల తర్వాత.. మిస్ వరల్డ్ పోటీలకు వేదికకానున్న భారత్
Miss World 2023 | ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మిస్ వరల్డ్ (Miss World 2023) పోటీలకు ఈ సారి భారత్ (India) ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ పోటీలు భారత్‌లో జరగబోతున్నాయి.
Miss World 2023 | ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మిస్ వరల్డ్ (Miss World 2023) పోటీలకు ఈ సారి భారత్ (India) ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ పోటీలు భారత్‌లో జరగబోతున్నాయి. తుది తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ.. 71వ మిస్ వరల్డ్ పోటీలు నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లీ (Julia Morley) వెల్లడించారు.
‘ఈ ఏడాది నవంబర్‌లో 71వ ప్రపంచ సుందరి పోటీలు (71st edition of Miss World) ఇండియాలో జరగబోతున్నాయని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నా. ఎన్నో ప్రత్యేకతలు, విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న భారత్‌లో ఈ పోటీలు నిర్వహించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని జూలియా వెల్లడించారు. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ ప్రపంచ సుందరి పోటీల్లో 130కిపైగా దేశాల నుంచి అభ్యర్థులు పాల్గొంటారు.
భారత్‌లో చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు మన దేశంలో ప్రపంచ సుందరి పోటీలు జరగనుండటం విశేషం. కాగా, భారత్ ఇప్పటి వరకూ ఆరుసార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. 1966 ఏడాదిలో రీటా ఫరియా మొదటి సారి భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ బచ్చన్ (1994), డయానా హైడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా(2000), మానుషి చిల్లర్ (2017) విశ్వ సుందరి కిరీటాలను దక్కించుకున్నారు.
Also Read..
Fake Seeds | సైబరాబాద్‌లో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు.. 3.3 టన్నుల నకిలీ సీడ్స్ సీజ్
Hyderabad to Leh-Ladakh Tour | హైదరాబాద్ నుంచి లడఖ్-లేహ్ ట్రిప్.. ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
Anurag Thakur: కోర్టు ఆదేశిస్తేనే.. బ్రిజ్‌ను అరెస్టు చేస్తారు: కేంద్ర మంత్రి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

