Odisha Train Accident | రైలు ప్రమాద మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత
Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారి డెడ్‌బాడీస్ (Crash Victims Bodies) ని బహానగ ప్రభుత్వ పాఠశాలలో (Bahanaga High School) భద్రపరిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాఠశాలను అధికారులు కూల్చివేశారు.
Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. సుమారు 1000 మందికిపైనే గాయాలపాలయ్యారు. ఘటన జరిగి వారం రోజులైనా ప్రమాద దృశ్యాలు ఇంకా ప్రజల కళ్ల ముందే మెదలాడుతున్నాయి. ఇక ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారి డెడ్‌బాడీస్ (Crash Victims Bodies) ని బహానగ ప్రభుత్వ పాఠశాలలో (Bahanaga High School) భద్రపరిచిన విషయం తెలిసిందే.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బహానగ పాఠశాలకు తరలించారు. అక్కడ నుంచి భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల తరలింపు తర్వాత పాఠశాలను శుభ్రపరిచారు. అయితే, అన్ని మృతదేహాలు ఒకే చోట చూడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో విద్యార్థులను ఆ పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. విద్యార్థులు సైతం స్కూల్‌కు వెళ్లేందుకు భయపడిపోతున్నారు.
దీంతో పాఠశాలను కూల్చివేయాలని స్కూల్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే పరిశీలించిన అధికారులు పాఠశాలను కూల్చివేశారు. 65 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల దెబ్బతిందని.. దీనికి తోడు తాజా పరిస్థితుల నేపథ్యంలోనే ఈ పాఠశాలను కూల్చివేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా స్వేన్ తెలిపారు.
Also Read..
Sharad Pawar | శరద్ పవార్‌కు హత్య బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన సుప్రియా సూలే
Samantha | రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సమంత.. పిక్స్ వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

