Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బొమ్మ కోసం గొడవపడుతున్న తన ఇద్దరు పిల్లల్ని ఓ తండ్రి విచక్షణారహితంగా చితకబాదాడు (Father Beats Girls). ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. మరో అమ్మాయి తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.
చంపా ప్రాంత నివాసి 35 ఏళ్ల సల్మాన్ అలీ మెకానిక్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలం కిందటే గొడవల కారణంగా అతడి భార్య వదిలేసి వెళ్లిపోయింది. అతడికి ఇద్దరు కుమార్తెలు అలీషా పర్వీన్ (8), అలీనా పర్వీన్ (9) ఉన్నారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ తండ్రి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలూ బొమ్మ విషయంలో ఇంట్లో గొడవ పడ్డారు (Fighting Sister For Toy). ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న సల్మాన్ పిల్లల మధ్య గొడవ చూసి సహనం కోల్పోయాడు. బెల్టు తీసుకొని ఇద్దరినీ దారుణంగా చితకబాదాడు.
కాలితో తన్నుతూ కొట్టాడు. ఆ సమయంలో పిల్లలిద్దరూ గట్టిగా అరుస్తుండటంతో ఇరుగుపొరుగు వారు వచ్చి అడ్డుకున్నారు. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ పిల్లల్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనలో చిన్న పాప అలీషా మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. అలీనా మాత్రం తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకొని సల్మాన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read..
Raksha Bandhan | చిన్నారులతో రాఖీ వేడుకలను జరుపుకున్న ప్రధాని మోదీ.. VIDEO
India Day Parade | న్యూయార్క్లో ఘనంగా ఇండియా డే పరేడ్.. ఆకట్టుకున్న అయోధ్య రామ మందిరం నమూనా
Sidda Ramaiah | కర్ణాటక గవర్నర్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసిన సీఎం సిద్ధరామయ్య