Sidda Ramaiah | కర్ణాటక గవర్నర్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసిన సీఎం సిద్ధరామయ్య
Sidda Ramaiah | ముడా (MUDA) కుంభకోణంలో తనపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
Sidda Ramaiah : మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (MUDA) కుంభకోణంపై సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇటీవల ఆమోదం తెలుపడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినందున ఇక సిద్ధరామయ్య అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
ముడా (MUDA) కుంభకోణంలో తనపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపాల్సి ఉంది. ఇదిలావుంటే గతంలో గవర్నర్ల అనుమతితో విచారణ ఎదుర్కొన్న పలువురు ముఖ్యమంత్రులు అరెస్టయ్యారు.
దాంతో ఇప్పుడు కర్ణాటక సీఎం కూడా అరెస్టవుతారానే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ముడా (MUDA) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతి ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. మైసూర్లో అక్రమంగా భూములు సేకరించారని సిద్ధరామయ్యపై ఆరోపణలు ఉన్నాయి. గత నెల రోజులుగా ఇదే అంశం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది.
భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం సామాజిక కార్యకర్త, న్యాయవాది టీజే అబ్రహం.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ గెహ్లాట్ అనుమతించారు. వాస్తవానికి తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గవర్నర్ తిరస్కరిస్తారని సిద్ధరామయ్య భావించారు. కానీ అనూహ్యంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

