Chennai | తమిళనాడు చెన్నై (Chennai)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన తల్లికి సరైన వైద్యం అందించలేదంటూ ఓ యువకుడు ప్రభుత్వ వైద్యుడిపై (doctor) కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సదరు వైద్యుడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల యువకుడు క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి ప్రేమను నగరంలోని గిండీ (Guindy) ప్రాంతంలో గల కలైంజర్ సెంటినరీ ఆసుపత్రి ( Kalaignar Centenary Hospital)లో ఔట్ పేషెంట్ విభాగంలో చేర్పించారు. ఈ ఏడాది మే నుంచి నవంబర్ వరకూ చికిత్స చేయించాడు. అయితే, తన తల్లి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు ఇవాళ ఉదయం వైద్యుడిపై దాడి చేశాడు. కత్తితో సుమారు ఏడు సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో వైద్యుడి ఛాతీ పై భాగం, ముఖం, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం సదరు వైద్యుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. దాడి అనంతరం పారిపోతున్న యువకుడిని ఆసుపత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
మరోవైపు ఘటన అనంతరం ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియమ్ స్పందించారు. ఆసుపత్రిని పరిశీలించి చికిత్స పొందుతున్న వైద్యుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం స్టాలిన్ విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
Also Read..
Bus Falls Into River | పెళ్లి బస్సు నదిలో పడి 14 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ వధువు
Ayodhya Ram Temple: ఖలిస్తానీ నేత బెదిరింపు.. అయోధ్య రామమందిరంలో భద్రత పెంపు
Polling Percent | జార్ఖండ్‌లో 29.. వయనాడ్‌లో 27.. పోలింగ్ శాతం ఇలా