అయోధ్య: అయోధ్య రామాలయం(Ayodhya Ram Temple)పై దాడి చేస్తామని ఖలిస్తానీ నేత పన్నున్ బెదిరించారు. గురుపత్వంత్ సింగ్ పన్నున్ మంగళవారం ఓ వీడియో మెసేజ్‌లో ఆ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రామ మందిరం చుట్టూ భద్రతను పెంచేశారు. నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ వ్యవస్థాపకుడైన పన్నున్.. నవంబర్ 16 లేదా 17వ తేదీన రామ మందిరంలో రక్తపాతం సృష్టించనున్నట్లు వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ 18వ తేదీన రామ్ వివాహ్ ఉత్సవం జరగనున్నది. ఆ ఉత్సవానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్నారు. పన్నున్ బెదిరింపు తర్వాత అయోధ్యను శత్రుదుర్బేధ్యంగా తయారు చేశారు. భద్రతను పెంచారు. భారీ సంఖ్యలో సీసీటీవీలను అమర్చారు. డ్రోన్ కెమెరాలను కూడా వాడుతున్నారు. రామ జన్మభూమి కాంప్లెక్స్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
‼️OUTRAGEOUS: Khalistani terrorist Pannun threatens to attack Hindu 🇨🇦MP Chandra Arya, 🇮🇳 Indian diplomats on 16th & 17th November
SFJ also threatened to target Ayodhya Ram Temple 👇 pic.twitter.com/KjkbRYkaPm
— Sputnik India (@Sputnik_India) November 11, 2024