Bus Falls Into River | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది (Bus Falls Into River). ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, వధువు మాత్రం ప్రాణాలతో (Bride Survives) బయటపడింది.
గిల్గిట్-బాల్టిస్తాన్ (Gilgit-Baltistan)లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 25 మందితో వెళ్తున్న బస్సు ఓ వంపు వద్ద అదుపుతప్పి నదిలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 10 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో వధువు ఒక్కటే ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె గిల్గిట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు.
Also Read..
Red Sea | ఎర్రసముద్రంలో అమెరికా యుద్ధ నౌకలపై హౌతీల దాడులు
Donald Trump: ఎలన్ మస్క్, వివేక్ రామస్వామికి .. కీలక బాధ్యతలు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్
Car Attack: చైనాలో కారు బీభత్సం.. 35 మంది మృతి, 45 మందికి గాయాలు