SpiceJet | విమాన ప్రయాణంలో చోటు చేసుకునే కొన్ని ఘటనలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణికుల ప్రవర్తన చర్చకు దారితీస్తుంటుంది. కొందరు వ్యక్తులు విమాన ప్రయాణంలో ఏవి చేయకూడదో అవే చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీ నుంచి ముంబై (Delhi-Mumbai flight) వెళ్లాల్సిన ఓ స్పైస్‌జెట్ (SpiceJet) విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు (passengers) హల్చల్ చేశారు. విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో కాక్‌పిట్‌లోకి (Cockpit) బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది.
స్పైస్‌జెట్‌కు చెందిన విమానం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముంబై వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉంది. విమానాన్ని టేకాఫ్ చేసేందుకు ట్యాక్సీయింగ్కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు వింతగా ప్రవర్తించారు. బలవంతంగా కాక్‌పిట్‌లోకి చేరుకునేందుకు ప్రయత్నించారు. సిబ్బంది, పైలట్లు ఎంత చెప్పినా వినకుండా విమానంలో గందరగోళం సృష్టించారు. దీంతో పైలట్ విమానాన్ని బే వే వద్దకు తరలించారు. విమానంలో హల్చల్ చేసి విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు మహిళలను దించేసి సీఐఎస్ఎఫ్కు అప్పగించారు. ఈ ఘటన కారణంగా విమానం దాదాపు ఏడు గంటలు ఆలస్యమైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు వెళ్లాల్సిన ఈ విమానం రాత్రి 7.31 గంటలకు ముంబైకి బయల్దేరి వెళ్లింది.
Also Read..
Shubhanshu Shukla | మరికాసేపట్లో భూమికి చేరుకోనున్న శుభాన్షు శుక్లా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్
GE-404 engine | అమెరికా నుంచి భారత్‌కు మరో GE-404 ఇంజిన్.. త్వరలో మరికొన్ని..!