B.Ed Student | ఒంటిపై పెట్రోల్ పోసుకొని కళాశాల విద్యార్థిని ఆత్మహత్య.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఒడిశా సీఎం
B.Ed Student | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore)లో బీఈడీ విద్యార్థిని (BEd. Student) ఆత్మహత్య (Suicide) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్రంగా స్పందించారు.
B.Ed Student | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore)లో బీఈడీ విద్యార్థిని (BEd. Student) ఆత్మహత్య (Suicide) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్రంగా స్పందించారు. యువతి మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విద్యార్థిని కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు లైంగిక వేధింపుల ఘటనపై సరైన దర్యాప్తు జరపాలని సీఎం మాఝీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు విద్యార్థిని మృతిపట్ల ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు కూడా విచారం వ్యక్తం చేశారు.
20 ఏండ్ల బాధిత యువతి బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో బీఈడీ చదువుతున్నది. ఆమెను తన లైంగిక వాంఛలు తీర్చాలంటూ హెచ్‌వోడీ సమీర్ కుమార్ సాహూ కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలు ఈ నెల 1న అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై వారం రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆమె ఆశించింది. అయితే కమిటీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితురాలు, మిగతా విద్యార్థులు శనివారం (ఈనెల 12న) కాలేజీ గేట్ ముందు ఆందోళన నిర్వహించారు.
హఠాత్తుగా బాధిత మహిళ.. ప్రిన్సిపల్ కార్యాలయం వద్దకు పరుగున వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి గాయపడ్డాడు. తోటి విద్యార్థులు వారిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే బాధితురాలి శరీరం 95 శాతం గాయపడటంతో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం రాత్రి 11.46 గంటలకు మరణించింది.ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అది ముమ్మాటికీ బీజేపీ సిస్టమ్ (BJP system) చేసిన హత్య అని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read..
BJP | ‘అది ఆయన చీప్ మైండ్‌సెట్‌కు నిదర్శనం’.. రాహుల్‌గాంధీపై బీజేపీ కౌంటర్ ఎటాక్
Rahul Gandhi | ‘అది బీజేపీ సిస్టమ్ చేసిన హత్య’.. ఒడిశా విద్యార్థిని ఆత్మహత్యపై రాహుల్‌గాంధీ
B.Ed Student | హెచ్‌వోడీ లైంగిక వేధింపులు.. మృత్యువుతో పోరాడి బీఈడీ విద్యార్థిని మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

