Shubhanshu Shukla | మరికాసేపట్లో భూమికి చేరుకోనున్న శుభాన్షు శుక్లా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్
Shubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష ప్రయాణం ముగింపుకు చేరింది.
Shubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష ప్రయాణం ముగింపుకు చేరింది. దాదాపు 18 రోజులపాటూ ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన శుభాన్షు బృందం భూమికి తిరుగు పయనమయ్యారు. వీరు ప్రయాణించే స్పేస్‌క్రాఫ్ట్ సోమవారం మధ్యాహ్నం 4.45 గంటలకు ఐఎస్ఎస్తో అన్‌డాకింగ్ ప్రక్రియ పూర్తిచేసుకుంది. మరికాసేపట్లో వీరు భూమికి చేరుకోనున్నారు. డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక దాదాపు 22 గంటలపాటు అంతరిక్షంలో ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో దిగనుంది. శుభాన్షు రాక కోసం భారత్ ఆసక్తికగా ఎదురుచూస్తోంది.
ఏడు రోజులు క్వారంటైన్..
వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత ఏడు రోజులపాటూ క్వారంటైన్‌కు (rehabilitation) తరలించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని వెల్లడించింది.
శుభాన్షు రికార్డు..
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లాతోపాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే. తిరుగు ప్రయాణం నేపథ్యంలో ఆదివారం అంతరిక్ష కేంద్రంలో ఫేర్వెల్ సెర్మనీ జరిపారు.
Also Read..
“Shubhanshu Shukla | అన్‌డాకింగ్ సక్సెస్.. భూమికి తిరుగుపయనమైన శుభాన్షు బృందం”
Shubhanshu Shukla: అంతరిక్షంలో హెయిర్ కటింగ్ చేయించుకున్న శుభాన్షు శుక్లా
GE-404 engine | అమెరికా నుంచి భారత్‌కు మరో GE-404 ఇంజిన్.. త్వరలో మరికొన్ని..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

