Shubhanshu Shukla | దాదాపు 18 రోజులపాటు ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) సహా మరో ముగ్గురి వ్యోమగాముల తిరుగు ప్రయాణం మొదలైంది. ఐఎస్ఎస్లో యాక్సి యం-4 మిషన్ అన్‌డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా (DRAGON UNDOCKS) పూర్తైంది. అనుకున్న సమయానికంటే పది నిమిషాలు ఆలస్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ‘డ్రాగన్’ వ్యోమనౌక విడిపోయింది. 23 గంటలపాటూ ప్రయాణించిన తర్వాత ఆ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమి మీదకు రానున్నది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు (భారత కాలమానం) వ్యోమగాములు ఫ్లోరిడాలోని నదీ జలాల్లో దిగనున్నారు.
SpaceX confirms that the SpaceX Dragon spacecraft, carrying Group Captain Shubhanshu Shukla, along with the crew, successfully undocked from the International Space Station.#AxiomMission4 pic.twitter.com/nP5pmvlWZP
— ANI (@ANI) July 14, 2025
ఏడు రోజులు క్వారంటైన్..
వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత ఏడు రోజులపాటూ క్వారంటైన్‌కు (rehabilitation) తరలించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని వెల్లడించింది.
శుభాన్షు రికార్డు..
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లాతోపాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్లోకి వెళ్తున్న తొలి భారతీయుడు కూడా ఇతనే. తిరుగు ప్రయాణం నేపథ్యంలో ఆదివారం అంతరిక్ష కేంద్రంలో ఫేర్వెల్ సెర్మనీ జరిపారు.
Also Read..
F-35 Fighter Jet | నెలరోజులైనా ఇంకా కేరళలోనే బ్రిటన్ ఫైటర్ జెట్
Saroja Devi | కన్నడ నటి సరోజాదేవి మృతికి ప్రధాని మోదీ సంతాపం
BR Gavai: ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరిన సీజేఐ బీఆర్ గవాయ్