Saroja Devi : కర్ణాటక రాష్ట్రానికి చెందిన అలనాటి నటి సరోజాదేవి (Saroja Devi) మృతికి ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ప్రముఖ నటి బీ సరోజాదేవి మరణం బాధాకరమైన విషయమని, భారతీయ సినిమా రంగానికి, సంస్కృతికి ఆమె ఒక ఉన్నతమైన ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు.
ఆమె తన అద్భుతమైన నటనా పటిమతో కొన్ని తరాల సినీ ప్రేక్షకులపై చెరిగిపోని ముద్ర వేశారని ప్రధాని మోదీ కొనియాడారు. అనేక భారతీయ భాషల్లో నటించిన ఆమె.. భారతీయ సినీ రంగానికి ఎనలేని సేవచేశారని కొనియాడారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.