Omar Abdulllah : జమ్ముకశ్మీర్ సీఎం (Jammu and Kashmir CM) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) సోమవారం ఉదయం అమాంతం గోడ దూకారు. మహారాజా హరిసింగ్ (Maharaja Hari Singh) కు చెందిన డోగ్రా బలగాలు (Dogra forces) 1931లో కాల్చిచంపిన వీరుల స్మారకంగా ఉన్న శ్మశానం గోడ దూకి ఆయన లోపలికి వెళ్లారు. అక్కడ అమరవీరుల (Martyrs) కు నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మహారాజా హరిసింగ్‌కు చెందిన డోగ్రా బలగాలు 1931 జూలై 13న వందల మంది కశ్మీరీ ఆందోళనకారులను కాల్చిచంపాయి. ఆ దుర్ఘటనను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జూలై 13న అమరవీరుల దినం జరుపుకుంటున్నారు. అయితే ఆ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు.
ఆదివారం అమరవీరుల దినం సందర్భంగా వారి స్మారక శ్మశానమైన మజర్ ఎ శుహాడాకు వెళ్లాలనుకుంటున్నానని ఒమర్ అబ్దుల్లా భద్రతాబలగాలకు సమాచారం ఇచ్చాడు. అంతే.. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఒమర్ నివాసం ముందు బంకర్ ఏర్పాటు చేసి ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు పలువురు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలను కూడా గృహాల్లో నిర్బంధించారు.
ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఒమర్ అబ్దుల్లా ఇంటి ముందు బంకర్‌ను ఎత్తేశారు. దాంతో సోమవారం ఉదయం ఆయన ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వయంగా కారు నడుపుకుంటూ అమరవీరుల స్మారక శ్మశానానికి చేరుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. అయినా వారు లోపలికి అనుమతించకపోవడంతో అమాంతం గోడదూకి వెళ్లారు.
అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించారు. వారి ఆత్మశాంతిని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమను ఆదివారం శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారని, మరి ఇవాళ ఎందుకు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. కేంద్రం తమను వారి బానిసలుగా భావిస్తోందని, కానీ తాము ప్రజలకు తప్ప ఎవరికీ బానిసలము కాదని వ్యాఖ్యానించారు.
#WATCH | Srinagar | J&K CM Omar Abdullah jumped over the boundary wall of Mazar-e-Shuhada to recite prayers after he was allegedly stopped by the security forces
Omar Abdullah said that he did not inform anyone before coming to the Mazar-e-Shuhada, as he was house arrested… https://t.co/gQTTepddvA pic.twitter.com/ou2LcFnIbr
— ANI (@ANI) July 14, 2025