F-35 Fighter Jet | సాంకేతిక సమస్యల కారణంగా కేరళ (Kerala)లోని తిరువనంతపురం (Thiruvananthapuram) ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల్లో (Fighter jets) ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) నెల రోజులు గడుస్తున్నా ఇంకా గాల్లోకి ఎగరలేదు. ఐదోతరం స్టెల్త్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఫైటర్ జెట్‌కు మరమ్మతులు చేసేందుకు యూకే నుంచి 24 మంది ఏవియేషన్ ఇంజినీర్ల బృందం ప్రత్యేక పరికరాలతో రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో ఇటీవలే కేరళకు చేరుకుంది. ఆ విమానానికి మరమ్మతులు చేసేందుకు దానిని హ్యాంగర్‌కు తగిలించి తరలించారు. విమానం మరమ్మతు ఇక్కడ పూర్తవుతుందా లేదా అనే సంగతిని బ్రిటన్ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. ఇక్కడే మరమ్మతు పూర్తయితే ఆ విమానం స్వయంగా బ్రిటన్‌కు వెళ్లనుంది. లేదంటే దాన్ని పార్ట్స్‌గా విడదీసి సీ-17 గ్లోబ్‌మాస్టర్ అనే రవాణా విమానంలో బ్రిటన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ యుద్ధ విమానం పార్ట్స్‌గా విడదీయడం సాధ్యం కాని పని అని తెలిసింది. ఒక్కో బోల్డ్‌కు ఒక్కో కోడ్ ఉన్నట్లుగా సమాచారం. దీంతో దాన్ని తయారు చేసిన సంస్థే ఈ సమస్యను పరిష్కరించగలదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
సాంకేతిక సమస్యతో ల్యాండింగ్..
కాగా గత నెల ఇండో-యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొన్న ఈ ఎఫ్-35బి విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఆ విమానాన్ని జూన్ 14న అర్ధరాత్రి తర్వాత తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. తొలుత ప్రతికూల వాతావరణం, ఇంధన కొరత కారణంగా విమానాన్ని అత్యవసరంగా దించినట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఆ ఫైటర్ జెట్‌లో ఇంజినీరింగ్ సమస్య తలెత్తినట్లు ఆ తర్వాత యూకే అధికారులు వెల్లడించారు. ఆ విమానానికి మరమ్మతులు చేయడానికి అదేరోజు రాత్రి ఏడబ్ల్యూ 101 మెర్లిన్ హెలికాఫ్టర్‌లో నిపుణులు వచ్చారు. మరమ్మతులు చేసినా విమానం మొరాయించింది. అప్పటి నుంచి తిరువనంతపురం ఎయిర్‌పోర్టులోనే ఉంది. ఇప్పుడు పరికరాలతో సహా 24 మంది స్పెషల్ ఎక్స్పర్ట్స్ బృందం వచ్చి విమానం రిపెయిర్కు ప్రయత్నిస్తోంది.
ఈ విమానం షార్ట్ టేకాఫ్‌తోపాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. అంతటి శక్తివంతమైన ఈ జెట్ ఇన్ని రోజుల పాటూ నిలిచిపోవడంతో నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. ఈ యుద్ధ విమానం OLXలో సేల్కు ఉంది అంటూ నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ ఫైటర్ జెట్ అమ్మకానికి వచ్చింది.. ఎవరైనా కొంటారా..? అంటూ నెటిజన్లు నెట్టింట తెగ పోస్టులు పెడుతున్నారు. 110 మిలియన్ డాలర్ల జెట్‌ను కేవలం 40 మిలియన్ డాలర్లకే పొందొచ్చంటూ జోకులు వేస్తున్నారు.
Also Read..
Tejas Express | నీళ్ల పప్పు, పాడైన పనీర్.. రైల్లో అందించిన ఆహారంపై ఆప్ నేత భార్య అసంతృప్తి
Etihad | ఆ స్విచ్‌లతో జాగ్రత్తగా ఉండండి.. పైలట్లకు ఎతిహాద్ ఎయిర్వేస్ కీలక హెచ్చరిక
Air India plane crash | ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి లోపాలూ లేవు : ఎయిర్ ఇండియా సీఈవో