Etihad | ప్రముఖ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ (Etihad Airways) తన పైలట్లకు, ఇంజినీరింగ్ బృందానికి ఇంధన కంట్రోలర్ స్విచ్‌లపై కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇంధన స్విచ్‌లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పైలట్లకు సూచించింది. అదేవిధంగా అన్ని విమానాల్లో ఇంధన స్విచ్‌లు పనిచేస్తున్న విధానంపై ఇంజినీరింగ్ బృందం తనిఖీలు నిర్వహించాలని కోరింది. అన్ని బోయింగ్ 787లను తనిఖీలు చేయాలని ఆదేశించింది.
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB).. కేంద్ర ప్రభుత్వానికి శనివారం ప్రాథమిక నివేదిక (preliminary probe report) సమర్పించిన విషయం తెలిసిందే. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు (fuel control switch) సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ నివేదికపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా విమానాల్లో ఇంధన స్విచ్‌లపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంధన స్విచ్‌ల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని ఎతిహాద్ ఎయిర్వేస్ తమ పైలట్లకు సూచించింది.
Also Read..
Air India plane crash | ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి లోపాలూ లేవు : ఎయిర్ ఇండియా సీఈవో
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని
DMK on Actor Vijay | విజయ్ బేసిక్ పాలిటిక్స్ తెలుసుకోవాలి : డీఎంకే