Tejas Express | రైళ్లలో అందించే ఫుడ్ (Meals) క్వాలిటీపై ప్రయాణికుల నుంచి ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మార్పు మాత్రం రావడం లేదు. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలే తరచూ పునరావృతం అవుతూ ఉన్నాయి.
తాజాగా భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ప్రీమియం రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ (Tejas Express)లో వడ్డించిన ఆహార నాణ్యతపై ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ నాయకుడి భార్య (AAP Leaders Wife) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆప్ లీడర్ సంజయ్ సింగ్ (Sanjay Singh) భార్య అనితా సింగ్ (Anita Singh) ఇటీవలే తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా అందించిన ఆహారంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రోటీ పాపడ్ కంటే చాలా గట్టిగా ఉందని, పప్పు నీళ్లగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
PNR No 2338310371
तेजस एक्सप्रेस में मिला खाना बेहद घटिया था। रोटी पापड़ जैसी सख्त, पनीर बासी और दाल की जगह सिर्फ़ पानी परोसा गया।क्या यही है रेलवे की “वर्ल्ड क्लास” सेवा? यात्रियों की सेहत से खिलवाड़ बंद हो!
माननीय @AshwiniVaishnaw जी, कृपया संज्ञान लें।@RailMinIndia pic.twitter.com/v0t0bbwwWE
— Anita Singh (@AnitaSingh_) July 11, 2025
‘తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించిన ఆహారం అధ్వానంగా ఉంది. రోటీ పాపడ్ కంటే గట్టిగా ఉంది. పాడైపోయిన పనీర్, పప్పుకు బదులు నీళ్లు వడ్డించారు. ఇదేనా ప్రపంచ స్థాయి సేవ..? ప్రయాణికుల ఆరోగ్యంతో ఆడుకోవడం ఆపండి’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ట్వీట్‌కు రైల్లో అందించిన ఫుడ్ ఫొటోలను జతచేశారు. ఈ ట్వీట్‌ను ఇండియన్ రైల్వేస్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ట్యాగ్ చేశారు. మరోవైపు ఈ ట్వీట్‌పై ఐఆర్సీటీసీ (IRCTC) స్పందించింది. రైళ్లలో భోజనం అందించే ముందు తనిఖీ చేస్తారని తెలిపింది. ఇతర ప్రయాణికులు ఎవరూ ఫిర్యాదులు చేయలేదని పేర్కొంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
महोदया,
आपके द्वारा दिनाँक 11/07/25 को नई दिल्ली -लखनऊ तेजस एक्स्प्रेस ट्रेन में खानपान संबंधित फीडबैक के संदर्भ में अवगत कराना है कि भोजन की गुणवत्ता जाँच परोसने से पूर्व की जाती है और उक्त कोच से किसी और यात्रीगण की इस संबंध में कोई शिकायत प्राप्त नही हुई है, अपितु…
— IRCTC (@IRCTCofficial) July 12, 2025
Also Read..
Etihad | ఆ స్విచ్‌లతో జాగ్రత్తగా ఉండండి.. పైలట్లకు ఎతిహాద్ ఎయిర్వేస్ కీలక హెచ్చరిక
Air India plane crash | ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి లోపాలూ లేవు : ఎయిర్ ఇండియా సీఈవో