శనివారం 28 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 15:24:00

ఆరు రాష్ట్రాలకు 4,381.88 కోట్ల అదనపు సహాయానికి కేంద్రం ఆమోదం

 ఆరు రాష్ట్రాలకు 4,381.88 కోట్ల అదనపు సహాయానికి కేంద్రం ఆమోదం

ఢిల్లీ :కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ రూ. ఆరు రాష్ట్రాలకు 4,381.88 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలిపింది. 2020 సంవత్సరంలో “అమ్ఫాన్”,“నిసర్గా” తుఫాన్లతో పాటు కొండచరియలు విరిగిపడ్డ కారణంగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకోసం ఈ నిధులను కేటాయించారు. ఇటీవల కురిసిన కారణంగా దెబ్బతిన్నఆరు రాష్ట్రాలకు కేంద్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) కింద అదనపు  సహాయాన్నికేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌ సీ) ఆమోదించింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి ఆరు రాష్ట్రాలకు 4,381.88 కోట్ల అదనపు కేంద్ర సహాయాన్ని హెచ్‌ఎల్‌సి ఆమోదించింది.కాలిన గాయాలపై నూనెలు, పౌడర్లు, పేస్టులు రాస్తున్నారా?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.