శనివారం 16 జనవరి 2021
National - Nov 25, 2020 , 19:11:48

లైఫ్ స‌ర్టిఫికెట్ల స‌మ‌ర్ప‌ర‌ణ‌కు గ‌డువు పెంపు

లైఫ్ స‌ర్టిఫికెట్ల స‌మ‌ర్ప‌ర‌ణ‌కు గ‌డువు పెంపు

న్యూఢిల్లీ: ‌పెన్ష‌న‌ర్లు జీవ‌న ప్ర‌మాణ ప‌త్రం (లైఫ్ స‌ర్టిఫికెట్‌) స‌మ‌ర్పించాల్సిన గ‌డువును కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి పొడిగించింది. ప్ర‌స్తుతం 2020, డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఉన్న‌ గడువును 2021, ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. గ‌తంలో కూడా కేంద్రం లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ గ‌డువును కేంద్రం పొడిగించింది. 2020, నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31కి పెంచింది. క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తుండ‌టం, వయోవృద్ధులపైనే ఈ ప్రభావం ఎక్కువగా పడుతుండ‌టం లాంటి ప‌రిణామాల‌ నేపథ్యంలో లైఫ్ సర్టిఫెకెట్లు సమర్పించే గడువు పొడిగించాలంటూ పలు అభ్యర్థనలు వచ్చాయ‌ని సిబ్బంది, ప్రజా, పెన్షన్ల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంతో సంప్రదింపులు జ‌రిపిన‌ అనంతరం పెన్షనర్ల జీవన ప్రమాణ పత్రం సమర్పణ గడువును మరింత పొడిగించాలని నిర్ణయించినట్టు ఆ శాఖ‌ ప్రకటించింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.