Jio World Plaza | అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే అత్యంత సంపన్నుడైన అంబానీ ఇంట్లో ఏం జరిగినా విశేషమే. చిన్న పార్టీ జరిగినా సరే వార్తల్లోకి ఎక్కేస్తుంటుంది. ఇక అంబానీ ఇంట నిర్వహించే ఏ వేడుకైనా సరే స్టార్స్ సందడి లేకుండా అది ముగియదు. వేడుక ఏదైనా పిలుపు రాగానే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రముఖ స్టార్లంతా అంబానీ ఇంట్లో వాలిపోతుంటారు. పార్టీకి తగ్గట్టు దుస్తులు ధరించి సందడి చేస్తుంటారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ‘జియో వరల్డ్ ప్లాజా’ (Jio World Plaza) పేరుతో దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాజాను మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్లాజా ప్రారంభోత్సవంలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ తారలు, ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. నీతా-ముకేశ్ అంబానీ, ఈషా అంబానీ, ఆకాశ్-శ్లోకా మెహతా, అనంత్-రాధికా మర్చంట్, దీపికా పదుకొణె, ఆలియా భట్, కరీనా కపూర్, జాన్వీ కపూర్, కత్రినా కైఫ్, రణ్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, అర్జున్ కపూర్, శ్వేతా బచ్చన్, సోనమ్ కపూర్, రష్మిక మందానా, కాజల్, పూజాహెగ్దే, శ్రుతి హాసన్, శోభిత ధూళిపాళ్ల, షెహనాజ్ గిల్, నోరా ఫతేహీ, కరిష్మా కపూర్, తమన్నా, విజయ్ వర్మ, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా, సునీల్ శెట్టి, అథియా శెట్టి తదితరులు ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పలువురు తారలు ర్యాంప్ వాక్‌తో ఆకట్టుకున్నారు.
ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ‘జియో వరల్డ్ ప్లాజా’ పేరుతో ఈ మాల్‌ను రిలయన్స్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాజా ముంబై నడిబొడ్డున బీకేజీలో జియో వరల్డ్ ప్లాజా (JWP), నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్‌కు దగ్గరగా సందర్శకులకు సులభంగా ఉండేలా ఏర్పాటు చేసింది. దేశంలో టాప్-ఎండ్, గ్లోబల్ స్టాండర్డ్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ ప్లాజాను ప్రారంభించారు. ఇది నేటి నుంచి అందుబాటులోకి రానుంది.
దాదాపు 7,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో ఈ ప్లాజా విస్తరించి ఉంది, ఇది నేటి నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. బల్గారీ, కత్యాయ్, లూయిస్ విట్టన్, వెర్సేస్, వాలెంటినో, మనీష్ మల్హోత్రా, అబు జానీ, సందీప్ ఖోస్లా, పోటరీ బార్న్ , అనేక ఇతర ఖరీదైన బ్రాండ్లు ఈ మాల్లో అందుబాటులో ఉంటాయి.

Jio World Plaza1

Jio World Plaza2

Jio World Plaza3

Jio World Plaza4

Jio World Plaza5

Jio World Plaza6

Jio World Plaza7

Jio World Plaza8

Jio World Plaza9

Jio World Plaza10

Jio World Plaza11

Jio World Plaza12

Jio World Plaza13

Jio World Plaza14

Jio World Plaza15

Jio World Plaza16

Jio World Plaza17

Jio World Plaza18

Jio World Plaza19

Jio World Plaza20

Jio World Plaza21

Jio World Plaza22

Jio World Plaza23

Jio World Plaza24

Jio World Plaza25

Jio World Plaza26

Jio World Plaza27

Jio World Plaza28

Jio World Plaza29

Jio World Plaza30

Jio World Plaza31

Jio World Plaza32

Jio World Plaza33
Also Read..
Varun Tej-Lavanya Tripathi | ఇటలీలో VarunLav పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో మెరిసిన కొత్త జంట
Indian Student: అమెరికాలో ఖమ్మం విద్యార్థికి కత్తి పోటు