Kolkata | పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా (Kolkata)లో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు ఆందోళన బాట పట్టారు (Doctors Protest). గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్కతా హైకోర్టు (Calcutta High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐ (CBI)కి అప్పగించింది.
కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరగాలని మృతురాలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఘటన జరిగి ఐదు రోజులైనా పోలీసుల దర్యాప్తులో పురోగతి లేదంటూ మండిపడింది. ఈ మేరకు కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు చీప్ జస్టిస్ శివజ్ఞానం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ విచారణ చేపట్టిన రాష్ట్ర పోలీసులు కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను బుధవారం ఉదయం లోగా సీబీఐకి అందజేయాలని ఆదేశించారు. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలి సీబీఐ అధికారులను కోర్టు ఆదేశించింది.
Also Read..
Ajit Pawar | చెల్లిపై భార్యను పోటీకి దింపి తప్పు చేశా : అజిత్ పవార్
Tamil Nadu | ఇదేం పని..? ఫుట్బాల్ మ్యాచ్ ఓడిపోయారని విద్యార్థులను చితకబాదిన పీఈటీ టీచర్
Bengaluru | బ్రేక్ పెడల్ కిందకు వాటర్ బాటిల్.. అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. VIDEO